ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 6:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

మంచిర్యాల, అక్టోబర్ 27, అర్జున్ సమాచారం:
జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. హాజీపూర్‌ మండలంలోని ర్యాలీ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు, పశువుల మేత కోసం అడవులు, పొలాల వైపు వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పులి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు. పులి సంచారంపై అధికారులు నిఘా ఉంచి.. దాని కదలికలను గుర్తించడం ద్వారా ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. పులి కనిపించినా.. దాని పాదముద్రలు లేదా ఇతర ఆనవాళ్లు గుర్తించినా ప్రజలు దాని దగ్గరకు వెళ్లకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. కాగా, పులి సంచారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
===========================